Crime News: టికెట్ బుక్ చేసుకుని మరీ చోరీలు
రైల్వే ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడితోపాటు బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ చంద్రభాను, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీను
నిందితుడి అరెస్టు.. 12 తులాల నగలు స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ చంద్రభాను, స్వాధీనం చేసుకున్న నగలు
రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: రైల్వే ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడితోపాటు బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ చంద్రభాను, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీను, నరసింహ శనివారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌దశరథ్ శ్రీపతి(33) పుణెలో హోటళ్లలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని రిజర్వేషన్ టికెట్లు తీసుకుని రైలు ఎక్కేవాడు. ప్రయాణికులు నిద్రలో ఉండగా దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈనెల 18న మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలి బ్యాగులోని 80గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదు దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం రైల్వేస్టేషన్‌లో నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దొంగిలించిన నగలను సిద్దిఅంబర్ బజార్‌లోని సిద్ధనాథ్ బంగారు దుకాణ నిర్వాహకుడు రమేష్ ఏకనాథ్ షిండే(44)కు విక్రయించినట్లుగా అంగీకరించాడు. వారిద్దరి వద్ద నుంచి 12 తులాల బంగారు నగలు, రూ.1లక్ష నగదు, 3సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండుకు తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!