Sexual Harassment: 14 ఏళ్ల బాలుడిపై జడ్జి లైంగిక వేధింపులు

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ ప్రత్యేక జడ్జి జితేంద్ర గొలియా 14 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధిస్తున్నట్లు సంచలన ఆరోపణలు వచ్చాయి. బాధితుడి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ కేసులు పరిశీలించే ఈ జడ్జితోపాటు ఆయన సహాయకులు

Updated : 01 Nov 2021 08:02 IST

  హైకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్‌

  రాజస్థాన్‌లో ఘటన

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ ప్రత్యేక జడ్జి జితేంద్ర గొలియా 14 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధిస్తున్నట్లు సంచలన ఆరోపణలు వచ్చాయి. బాధితుడి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ కేసులు పరిశీలించే ఈ జడ్జితోపాటు ఆయన సహాయకులు ఇద్దరు తన కుమారుణ్ని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపుతానని జడ్జి వితంతువునైన తనను బెదిరించినట్లు ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతో జడ్జిపై తక్షణం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో బాలుణ్ని బెదిరించిన ఏసీబీ అధికారి పరమేశ్వర్‌లాల్‌ యాదవ్‌ కూడా సస్పెండ్‌ అయ్యారు.

ఏడో తరగతి చదువుతున్న బాలుడు ఆటలాడుకునేందుకు రోజూ భరత్‌పుర్‌ మైదానానికి వెళ్లేవాడు. స్పెషల్‌ జడ్జి జితేంద్ర, ఆయన సహాయకులిద్దరూ అక్కడికి వస్తుంటారు. అక్కడే వారు బాలుడితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి మద్యం, మత్తుపదార్థాలు ఇచ్చేవారు. స్పృహ కోల్పోయాక తప్పుడు చేష్టలకు పాల్పడేవారు. తల్లి ఫిర్యాదు మేరకు మథుర గేట్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు సమయంలో పిల్లల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు గంగారామ్‌ బాధితులతో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని