Suicide: రూ.6 వేలకోసం భార్యాభర్తల ఆత్మహత్య

ఇంట్లో దాచిన సొమ్ము కనిపించడం లేదని గొడవపడిన భార్యాభర్తలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలోని గోసంగికాలనీలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ మధుసూదన్‌ కథనం ప్రకారం..

Updated : 01 Nov 2021 07:33 IST

కోదండం సాయిలు,  పోచవ్వ

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: ఇంట్లో దాచిన సొమ్ము కనిపించడం లేదని గొడవపడిన భార్యాభర్తలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలోని గోసంగికాలనీలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ మధుసూదన్‌ కథనం ప్రకారం.. కోదండం సాయిలు (45), పోచవ్వ (42) భార్యాభర్తలు. కూలి పనులు చేసుకుని బతుకుతుంటారు. సాయిలుకు ఆమె మూడో భార్య. వీరికి సంతానం లేదు. మొదటి ఇద్దరు భార్యలు అనారోగ్యంతో మృతి చెందారు. అక్టోబరు 27న ఇంట్లో ఉంచిన రూ. 6 వేలు కనిపించడం లేదని భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. మర్నాడూ ఇదే విషయమై పోట్లాడుకున్నారు. మనస్తాపం చెందిన పోచవ్వ ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం సాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం గోసంగి కాలనీ సమీపంలోని చర్చి వెనకాల రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందడంతో బంధువులు వెళ్లిచూశారు. సాయిలు మృతదేహం సగం కాలిపోయి ఉండగా, సమీపంలోని నీటి కుంటలో పోచవ్వ మృతదేహాన్ని గుర్తించారు. సాయిలు నిప్పంటించుకొని చనిపోయాడని, పోచవ్వ కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుందని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని