Crime News: ఇష్టం లేదని దాష్టీకం.. ఆరేళ్ల బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రి

ఓ బాలుడిని సవతి తండ్రే కొట్టి చంపిన దారుణ ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రామునాయుడు తెలిపిన  ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం దిగ్వాల్‌కు చెందిన నరసింహులు, అరుణను పదకొండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు

Updated : 03 Nov 2021 09:36 IST

అరుణ్‌కుమార్‌ మృతదేహం

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఓ బాలుడిని సవతి తండ్రే కొట్టి చంపిన దారుణ ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రామునాయుడు తెలిపిన  ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం దిగ్వాల్‌కు చెందిన నరసింహులు, అరుణను పదకొండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేళ్ల జాన్‌పాల్‌, ఏడు సంవత్సరాల జస్వంత్‌, అరుణ్‌కుమార్‌(6)లు ఉన్నారు. నరసింహులు తాగుడుకు బానిసై ఏడాది క్రితం మృతి చెందాడు. ఇతను చనిపోక ముందు అరుణకు గద్వాల్‌లోని తిరుమల కంపెనీలో పనిచేస్తుండగా వినయ్‌తో పరిచయం ఉండటంతో అరుణ, వినయ్‌ కలిసి ఉండేవారు. నెల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ పద్మానగర్‌కు బతుకుదెరువుకు వచ్చి ఫెన్నార్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారు. మొదటి నుంచి అరుణ్‌కుమార్‌ అంటే వినయ్‌కు ఇష్టం ఉండేది కాదు. ప్రతి చిన్న విషయానికి కొట్టేవాడు. నువ్వు అలా కొడితే నేను వెళ్లిపోతానని బాలుడి తల్లి బెదిరించడంతో కొంతకాలం ఏమీ అనలేదు. మూడు రోజుల క్రితం లాగులో మలవిసర్జన చేసుకున్నాడనే నెపంతో తీవ్రంగా కొట్టాడు. పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతానని అరుణ, వినయ్‌తో గొడవపడింది. ఇది మనసులో పెట్టుకుని అరుణ్‌కుమార్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అరుణ పరిశ్రమలో విధులకు వెళ్లగా బాలుడిని సవతి తండ్రి తీవ్రంగా కొట్టాడు. సాయంత్రం బాలుడు స్పృహ తప్పిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో బాలుడిని ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. తల్లి వచ్చి చూసేసరికి చిన్నకుమారుడు చనిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని