
గుజరాత్లో అగ్ని ప్రమాదం.. 25 వాహనాలు దగ్ధం
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్లోని ఖేదా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఖేదా పోలీస్ స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో 25కిపైగా వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కార్లు, ద్వి చక్ర వాహనాలు మంటల్లో దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. రాత్రి వేళ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.