
Cyber Crime: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు పెళ్లి పేరుతో సైబర్ కిలాడి వల
హైదరాబాద్: ఫేస్బుక్లో పరిచయమై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడి నుంచి రూ.95 లక్షలు దోచేసిందో సైబర్ కిలాడి. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫేస్బుక్ ఖాతాకు అందమైన అమ్మాయి ముఖచిత్రంతో ఉన్న ఖాతా నుంచి మిత్ర విజ్ఞప్తి(ఫ్రెండ్ రిక్వెస్ట్) రావడంతో అంగీకరించాడు. తాను ఏపీలోని గుంటూరులో ఉంటానని, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానంటూ వివరాలను చెప్పింది. కొంతకాలం వారిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో మనసులు సైతం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంత జరిగినా బాధితుడు ఆ అమ్మాయిని ప్రత్యక్షంగా చూడలేదు. మరోవైపు, తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని చెప్పడంతో.. విడతల వారీగా రూ.95 లక్షలు ఆమెకు ముట్టజెప్పాడు. అనంతరం ఆ అమ్మాయి ఫేస్బుక్ ఖాతా డిలీట్ అయింది. ఫోన్లోనూ అందుబాటులో లేకుండా పోయింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.