Cyber Crime: వస్తువు కొనాలి.. ఎలా ఉందో రాయాలి!

మీరేం చేయొద్ధు వస్తువులు కొనాలి. అది ఎలా ఉందో ‘రివ్యూ’ రాయాలంతే. మీ కమిషన్‌ మీకు వచ్చేస్తుంది. ఇంట్లో ఉంటూనే రూ.లక్షల్లో సంపాదించవచ్ఛు..

Updated : 20 Nov 2021 07:52 IST

మహిళకు రూ.1.79 లక్షల టోకరా

ఈనాడు, హైదరాబాద్‌: మీరేం చేయొద్ధు వస్తువులు కొనాలి. అది ఎలా ఉందో ‘రివ్యూ’ రాయాలంతే. మీ కమిషన్‌ మీకు వచ్చేస్తుంది. ఇంట్లో ఉంటూనే రూ.లక్షల్లో సంపాదించవచ్ఛు.. అంటూ ఓ మహిళను ముంచేశారు. మియాపూర్‌లో నివసించే బాధితురాలి(29)కి ఇటీవల ఓ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ‘మెర్రీ జాబ్స్‌.కామ్‌’ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ ఉంది. క్లిక్‌ చేసి సభ్యత్వం తీసుకున్నారు. దినేష్‌ కంపెనీ తరఫున వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేశారు. రివ్యూ రాస్తే కొనుగోలు చేసిన వస్తువు విలువలో 15 శాతం కమీషన్‌గా ఇస్తామని చెప్పాడు. తొలుత ప్రెషర్‌ కుక్కర్‌ కొనుగోలు చేసి రివ్యూ రాయగా 15 శాతం కమీషన్‌ వచ్చింది. స్మార్ట్‌ టీవీ తీసుకొని, రివ్యూ పూర్తి చేసి అప్‌లోడ్‌ చేయగా రూ.50వేలు జమయ్యింది. విత్‌డ్రాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకిలా అని అడిగితే రూ.50వేలు వెచ్చించి మరో వస్తువును కొనాలన్నారు. అలా రూ.1.79 లక్షల విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయించారు. వస్తువులు, కమీషన్‌ రాకపోవడంతో ఆమె సైబరాబాద్‌ సైబర్‌ పోలీసుల్ని ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని