Crime News: ముఖ రతి నేరమే.. తీవ్రమైనది కాదు!

చిన్నారులతో ముఖ రతిని అత్యంత తీవ్ర నేరంగా పరిగణించలేమని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ..

Published : 24 Nov 2021 09:41 IST

దోషికి విధించిన శిక్షను పదేళ్ల నుంచి ఏడేళ్లకు తగ్గించిన అలహాబాద్‌ హైకోర్టు

అహ్మదాబాద్‌: చిన్నారులతో ముఖ రతిని అత్యంత తీవ్ర నేరంగా పరిగణించలేమని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. సెషన్స్‌ కోర్టు దోషికి విధించిన 10ఏళ్ల జైలు శిక్షను 7 ఏళ్లకు తగ్గించింది. రూ.5,000 జరిమానా విధించింది. అయితే, ఇలాంటి నేరాలు శిక్షార్హమైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది. బాలుడితో ముఖ రతి చేయించుకున్న వ్యక్తిని దోషిగా తేల్చిన సెషన్స్‌ కోర్టు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 6, 10 ప్రకారం 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును ముద్దాయి హైకోర్టులో సవాల్‌ చేశాడు. దీన్ని విచారించిన ధర్మాసనం ముఖ రతి నేరమే కానీ, అత్యంత తీవ్రమైనది కాదని పేర్కొంది. దీనికి పోక్సో చట్టంలోని సెక్షన్‌ 4 వర్తిస్తుందని, సెక్షన్‌ 6, 10 వర్తించవని చెప్పింది. ఈ సెక్షన్‌ ప్రకారం దోషికి కనీసంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడి ఇంటికి నిందితుడు వెళ్లాడు. అతని పదేళ్ల కుమారుడిని బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ఆ విషయాన్ని ఇంటి వద్ద ఉన్న పెద్దలకు తెలపడంతో వారు కేసు పెట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని