Updated : 11 Dec 2021 09:40 IST

TS News: సంతాన సాఫల్యం పేరుతో వరంగల్‌లో చీకటి దందా..

నిందితుల అరెస్టు చూపుతున్న సీపీ తరుణ్‌జోషి

కమలాపూర్‌, న్యూస్‌టుడే: సంతానం లేని దంపతులు తమ వద్ద చికిత్స తీసుకుని మందులు వాడితే త్వరగా సంతానం కలుగుతుందని మోసగిస్తున్న నకిలీ డాక్టర్‌, ఓ ప్రైవేటు క్లినిక్‌లో జరిగే చీకటి దందాను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు శుక్రవారం గుట్టురట్టు చేశారు. మూడు రోజుల పాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆపరేషన్‌ చేసి చేధించారు. జిల్లా అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మదన్‌మోహన్‌ వివరాల ప్రకారం.. సమ్మయ్య అనే ఆర్‌ఎంపీ డాక్టర్‌ మహిళలకు వైద్యపరీక్షలు చేయడం, సంతానం కలిగిస్తామని చెబుతూ అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారు. క్లినిక్‌లో గైనకాలజీ వైద్యులున్నట్లు బోర్డులు పెట్టినా వారు రావడం లేదు. ఈ క్లినిక్‌లో ఇన్‌ట్రా వెజైనల్‌ ఇంజక్షన్లు  ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. సంతాన సాఫల్యతకు శిక్షణ పొందిన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుని మందులు వాడితే ఫలితముంటుందన్నారు. గ్రామీణ మహిళలు తెలిసీ తెలియక ఇలాంటి వైద్యులను సంప్రదించి మోసపోవద్దని సూచించారు.

అనంతరం ఆర్‌ఎంపీ సమ్మయ్య, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గాదె ధనుంజయను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి కమిషరేట్‌లో సీపీ తరుణ్‌జోషి ముందు హాజరుపరిచారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ, తహసీల్దార్‌ జాహెద్‌ పాషా, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సంయుక్త, కమిషనరేట్ వైద్యాధికారి డాక్టర్‌ విజయ్‌ తదితరులున్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని