ఇష్టం లేకున్నా శృంగారానికి యత్నం.. భార్య ఏం చేసిందంటే..!

బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు యత్నించిన భర్తపై ఆగ్రహం వ్యక్తంచేసిన భార్య (24), అంతటితో ఆగకుండా ఏకంగా

Published : 14 Dec 2021 11:30 IST

టీకమ్‌గఢ్‌: బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు యత్నించిన భర్తపై ఆగ్రహం వ్యక్తంచేసిన భార్య (24), అంతటితో ఆగకుండా ఏకంగా ఆ వ్యక్తి అంగాన్నే కోసేసింది. మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ నెల ఏడో తేదీన టీకమ్‌గఢ్‌ నగరంలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు 26 ఏళ్ల బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు జాతర పోలీస్‌స్టేషన్‌ బాధ్యుడు తివేంద్ర త్రివేదీ తెలిపారు. ‘‘నా భార్యకు ఇష్టం లేనప్పటికీ శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించా. దీంతో ఆమె ఈ ఘోరానికి పాల్పడింది’’ అని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో వారికి వివాహం జరిగిందని, అనంతరం కొన్ని గొడవల కారణంగా విడిపోయిన వారు ఇటీవలే కలిసి ఉంటున్నారని చెప్పారు. ‘‘ఏడో తేదీన ఘటన జరిగినా.. శస్త్రచికిత్స చేయించుకున్నందున బాధితుడు ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 324 కింద కేసు నమోదు చేశాం’’ అని త్రివేదీ వివరించారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని