Crime News: భారత క్రికెట్‌ జట్టులో చోటు కల్పిస్తామని టోకరా

‘మేం.. మానవ హక్కుల కమిటీ ప్రతినిధులం.. భారత క్రికెట్‌ జట్టులో అవకాశం కల్పిస్తాం’ అని చెప్పి ఓ యువ క్రికెటర్‌ నుంచి నగదు కాజేశారు..

Updated : 22 Dec 2021 07:32 IST

హైదరాబాద్‌: ‘మేం.. మానవ హక్కుల కమిటీ ప్రతినిధులం.. భారత క్రికెట్‌ జట్టులో అవకాశం కల్పిస్తాం’ అని చెప్పి ఓ యువ క్రికెటర్‌ నుంచి నగదు కాజేశారు సైబర్‌ కేటుగాళ్లు. బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనంప్రకారం.. టోలిచౌకికి చెందిన యువతి, ఆమె సోదరుడు క్రికెటర్లు. సెప్ట్టెంబరు 29న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. ‘మీరు, మీ సోదరుడు క్రికెటర్లని తెలిసింది, మీలాంటి ప్రతిభావంతులే భారత జట్టుకు అవసరం, అవకాశం కల్పిస్తాం’ అని చెప్పారు. బాధితురాలు నమ్మారు. అవతలి వ్యక్తి కోరినట్లుగా రూ.1.25లక్షలు బదిలీచేశారు. అవతలి వ్యక్తి రెండున్నర నెలలుగా వీరిని బుకాయిస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయగా.. క్రికెట్‌ కమిటీవారు మరికొంత డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని