TS News: ద్విచక్ర వాహనంపై 103 చలానాలు

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 103 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ద్విచక్ర వాహనదారుడు బుధవారం సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు. ఎస్సై ప్రసాద్‌ కథనం ప్రకారం.. ట్రాఫిక్‌ పోలీసులు ఉదయం 11

Updated : 23 Dec 2021 07:03 IST

రసీదు చూపుతున్న అరవింద్‌

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ఒకటి, రెండు కాదు.. ఏకంగా 103 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ద్విచక్ర వాహనదారుడు బుధవారం సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు. ఎస్సై ప్రసాద్‌ కథనం ప్రకారం.. ట్రాఫిక్‌ పోలీసులు ఉదయం 11 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్‌ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వచ్చిన పురానాపూల్‌ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి అరవింద్‌ను పోలీసులు ఆపారు. పరిశీలించగా.. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో అతడి బైక్‌పై 103 ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రూ.32,200 చలానా బకాయి ఉన్నట్లు తేలింది. దీంతో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని