Firing: కుమార్తెను కొట్టడంతో.. పాఠశాల డైరెక్టర్‌పై జవాను కాల్పులు

హోం వర్క్‌ చేయనందుకు కుమార్తెను టీచర్‌ కొట్టడంపై ఆర్మీ జవాను ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ఏకంగా పాఠశాల డైరెక్టర్‌పైనే కాల్పులు జరిపాడు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన

Updated : 05 Jan 2022 07:12 IST

జైపుర్‌: హోం వర్క్‌ చేయనందుకు కుమార్తెను టీచర్‌ కొట్టడంపై ఆర్మీ జవాను ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ఏకంగా పాఠశాల డైరెక్టర్‌పైనే కాల్పులు జరిపాడు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్వాడా గ్రామానికి చెందిన సైనికుడు పప్పు గుర్జార్‌ కుమార్తె ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. హోం వర్క్‌ చేయకపోవడంతో టీచర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఆ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు గుర్జార్‌ పాఠశాల డైరెక్టర్‌ను కలిసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం గుర్జార్‌ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్‌ తీసి పాఠశాల డైరెక్టర్‌పై ఎక్కుపెట్టాడు. అనంతరం కాల్చాడు. ఇంతలో గొడవ ఆపేందుకు మధ్యలోకి వచ్చిన గుర్జార్‌ భార్య భుజానికే ఆ తూటా తగిలింది. అనంతరం జవాను అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని