Hyderabad News: కుమార్తె ఛాటింగ్‌ను చూపి..తండ్రికి బెదిరింపులు

చరవాణిలో కుమార్తె ఛాటింగ్‌ వివరాలను చూపి ఓ తండ్రిని డబ్బులు

Published : 09 Jan 2022 07:51 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: చరవాణిలో కుమార్తె ఛాటింగ్‌ వివరాలను చూపి ఓ తండ్రిని డబ్బులు డిమాండ్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన ప్రబుద్ధుడిపై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనగర్‌కాలనీలో నివసించే గుత్తేదారు వద్దకు ఈ నెల 1న అయ్యప్ప అనే వ్యక్తి వచ్ఛి. తాను ట్రావెల్స్‌ బస్సు డ్రైవరునని.. బంజారాహిల్స్‌లోని మీ స్థలం ఓఎన్‌జీసీకి అద్దెకు కావాలని, సదరు సంస్థ అధికారి సైతం వస్తున్నారంటూ నమ్మించాడు. అదే రోజు సాయంత్రం తిరిగొచ్చిన అయ్యప్ఫ. ఒక నకిలీ చరవాణి ఛాటింగ్‌ను గుత్తేదారుకు చూపారు. ఆయన కుమార్తె గుర్తుతెలియని వ్యక్తితో ఛాటింగ్‌ చేసిందని పేర్కొంటూ.. దానిని తొలగించడానికి డబ్బులివ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. దీన్ని పట్టించుకోకపోవంతో గుత్తేదారును చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆయన బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అయ్యప్పపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని