Updated : 12 Jan 2022 07:19 IST

Crime News: పట్టించుకోకుండా వేరే పెళ్లి చేసుకుందని పగబట్టాడు..


ఖలీల్‌  

అమీర్‌పేట, న్యూస్‌టుడే: తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుందనే కక్షతో ఓ వ్యక్తి మహిళపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరిన బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(35)కి అదేప్రాంతానికి చెందిన వ్యక్తితో 2007లో వివాహమైంది. జీవనోపాధి నిమిత్తం వారు నగరానికి వచ్చారు. వీరికి ముందు కుమారుడు పుట్టాడు. తరువాత కుమార్తె పుట్టిందని భర్త 2009లో ఆమెను వదిలివెళ్లిపోయాడు. ఎర్రగడ్డలోని బి.శంకర్‌లాల్‌నగర్‌లో ఉంటున్న ఆమె ఇళ్లలో, ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డకు చెందిన సయ్యద్‌ ఖలీల్‌(34)తో పరిచయం పెంచుకుంది. 2017లో ఎర్రగడ్డకు చెందిన చెఫ్‌(36)ను రెండో పెళ్లిచేసుకుంది. తరువాత వీరికి కుమారుడు జన్మించాడు. అయితే తాను రెండో పెళ్లి చేసుకున్న విషయం ఖలీల్‌కు తెలియకుండా జాగ్రత్తపడింది. పెళ్లి విషయం తెలుసుకున్న ఖలీల్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

అదను కోసం ఎదురుచూసి..
వేరొక పెళ్లి చేసుకుందనే కోపంతో అదనుచూసి అంతమొందించాలని ఖలీల్‌ పథకం వేశాడు. ఎర్రగడ్డ అంగడిలో మూడు కత్తులు కొన్నాడు. మంగళవారం ఉదయం గౌతంపురికాలనీలో ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా చెట్టు చాటు నుంచి ఒక్కసారిగా వచ్చి కత్తులతో దాడిచేశాడు. బాధితురాలు కేకలు వేస్తూ పరుగు పెట్టగా వెంబడించి మరీ మెడ, కడుపులో కత్తితో పొడిచాడు. ఆమె రక్తపుమడుగులో కుప్పకూలిపోవడంతో చనిపోయిందని భావించి పరారయ్యాడు. తరువాత బాధితురాలు పైకి లేవడంతో స్థానికులు అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. సీసీఫుటేజీల ఆధారంగా పోలీసులు ఖలీల్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని