TS News: మానసిక వేదనతో యువ న్యాయవాది ఆత్మహత్య

చదువులో ప్రథమ శ్రేణి... భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నత విద్య కోసం లండన్‌ వెళ్లాడు.. సెలవుపై స్వదేశానికి వచ్చి అనార్యోగంతో బాధపడుతూ తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ యువ న్యాయవాది ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు అండగా ఉంటాడనుకున్న

Updated : 12 Jan 2022 08:51 IST

కుమారుడి మృతితో తల్లి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: చదువులో ప్రథమ శ్రేణి... భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నత విద్య కోసం లండన్‌ వెళ్లాడు.. సెలవుపై స్వదేశానికి వచ్చి అనార్యోగంతో బాధపడుతూ తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ యువ న్యాయవాది ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి సైతం ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు ఆమెను రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ నగరంలోని జ్యోతినగర్‌కు చెందిన నక్క అరవింద్‌ప్రసాద్‌(33) తండ్రి రాజేశ్వర్‌రాజు చిన్నతనంలోనే మృతి చెందటంతో తల్లి సురేఖ కష్టపడి అతన్ని ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చింది. న్యాయవిద్యను అభ్యసించి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశాడు. తెలంగాణ పోలీస్‌ అకాడమిలో సైతం అతిథి అధ్యాపకుడిగా పని చేశాడు. ఓ రెండు సంవత్సరాల క్రితం యువతిని వివాహం చేసుకోగా, వారి మధ్య ఏర్పడిన విభేదాలతో విడిపోయారు.

ఆరు నెలల కిందనే లండన్‌లో ఎల్‌.ఎల్‌.ఎం. విద్యను అభ్యసించడానికి స్టూడెంట్ వీసాపై వెళ్లాడు. పది రోజుల కింద సెలవుపై వచ్చాడు. మరో మూడు రోజుల్లో తిరిగి లండన్‌ వెళ్లాడానికి తగిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. మంగళవారం ఉదయం భవనం పై అంతస్తులోని అరవింద్‌ గదిలోకి తల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా తలుపులోపలి వైపు గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా అతను బయటకు రాకపోవడతో స్థానికులను పిలవగా వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి తన గదిలో అరవింద్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. సోమవారం రాత్రి వరకు తనతో సంతోషంగా ఉన్న కుమారుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని తల్లి సురేఖ బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను అదుపు చేశారు. గొంతుపై కొంత చర్మం తెగడంతో 108 వాహన సిబ్బంది వచ్చిన చికిత్స చేశారు. రెండేళ్ల కిందట తలపై చిన్న శస్త్రచికిత్స జరిగిందని, అప్పుడుప్పుడు తలనొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నానని అరవింద్‌ రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లి సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో ఠాణా పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని