16 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా తండ్రి, అన్న లైంగిక దాడి

ఓ 16 ఏళ్ల బాలికపై సొంత తండ్రి, సోదరుడే లైంగిక దాడికి పాల్పడ్డారు.

Published : 20 Jan 2022 11:04 IST

ఓ 16 ఏళ్ల బాలికపై సొంత తండ్రి, సోదరుడే లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండేళ్లుగా వారి అకృత్యాలను భరిస్తూ వస్తున్న బాలిక.. చివరకు తన ఉపాధ్యాయులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ధారావిలో జరిగింది. 2019 నుంచి తనపై తండ్రి, సోదరుడు లైంగిక దాడికి పాల్పడుతున్నారని తన పాఠశాలోని ప్రధానోపాధ్యాయురాలికి బాలిక తెలిపింది. అనంతరం ఉపాధ్యాయులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019, జనవరి 25న ఇంట్లో నిద్రపోతున్న తనపై అన్న అఘాయిత్యానికి ఒడిగట్టాడని, అంతకుముందే ఓసారి ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఫ్యాక్టరీలో ఉండగా తండ్రి లైంగికంగా హింసించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పలుమార్లు దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితురాలి తండ్రి (43), సోదరుడి(20)పై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత సోమవారం ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని