Ap News: సీఎంని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. యువకుడి అరెస్టు

మానవబాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్‌ క్రైమ్‌ ఎస్పీ రాధిక మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి హైదరాబాద్‌లో ప్రైవేటు

Published : 22 Jan 2022 01:36 IST

అమరావతి: మానవబాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్‌ క్రైమ్‌ ఎస్పీ రాధిక మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 16న ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు తెలిపారు. కన్నా భాయ్‌ అనే అకౌంట్‌ పేరుతో ‘మానవబాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని’ ట్విటర్‌లో పోస్టు చేశాడు. అయితే, వెంటనే ఆ పోస్టు డిలీట్‌ చేయడంతో పాటు ట్విటర్‌ అకౌంట్‌ మూసేశాడు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫణిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు జనసేన మద్దతు దారుడని చెప్పినట్టు ఎస్పీ తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని