logo

కొత్త పీఆర్సీ వద్దు.. పాత వేతనాలే ఇవ్వాలి

కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించేందుకు డీడీవోలను బలవంతం చేసేలా ఖజానా అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, కొత్త పీఆర్సీ వద్ధు. పాత జీతాలే ఇవ్వాలని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్‌లాల్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరించబోమని

Updated : 22 Jan 2022 06:50 IST


ఖజానా శాఖ డీడీ రామచంద్రరావుతో సమావేశమైన ఎన్జీవో సంఘం, ఏపీ ఐకాస సంఘం నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించేందుకు డీడీవోలను బలవంతం చేసేలా ఖజానా అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, కొత్త పీఆర్సీ వద్ధు. పాత జీతాలే ఇవ్వాలని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్‌లాల్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరించబోమని ఖజానా ఉద్యోగులు తేల్చిచెప్పారు. అయినా ఎందుకు వారిని జీతాల బిల్లులు చేయాలని బలవంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన తమ సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఖజానా శాఖ ఉపసంచాలకులు రామచంద్రరావును కలిశారు. కొత్త పీఆర్సీ-2022 ప్రకారం జనవరి జీతాల బిల్లులు పంపాలని అన్ని శాఖల డీడీవోలకు, అకౌంటెంట్లకు సంక్షిప్త సమాచారం పంపడం, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని జవహర్‌లాల్‌ ఖజానా శాఖ డీడీ దృష్టికి తీసుకెళ్లారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ కోసం చీకటి జీవోలను రద్దు చేయాలని, తాము ఉద్యమిస్తుంటే బిల్లులు చేయాలని ఒత్తిళ్లు చేయడం తగదన్నారు. మరోవైపు సీఎఫ్‌ఎంఎస్‌లో పాత విధానం పనిచేయకుండా నిలిపేయడం ఎంతవరకు న్యాయమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నామని డీటీవో పేర్కొన్నారు. ఇరువురి మధ్య వాదోపవాదనలు జరిగాయి. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం జనవరి నుంచి కొత్త జీతాలను డీడీఈవోల ద్వారా బలవంతంగా వేలిముద్రలు వేయించి, అనుమతించేలా అధికారులు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కొత్త పీఆర్సీ వద్ధు. పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. డీడీని కలిసిన వారిలో ఏపీ ఎన్జీవో సంఘం, ఏపీ ఐకాస నాయకులు భాస్కర్‌నాయుడు, లక్ష్మీనారాయణ, కృష్ణుడు, సాంబశివారెడ్డి, ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పలనాటి సునీల్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు జెడ్‌ కరుణాకర్‌, కురుమూర్తి, భరత్‌, మురళి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు