Updated : 28 Jan 2022 05:03 IST

భార్యపై ప్రేమతోనే చోరీలకు తెగిస్తూ..

అహ్మదాబాద్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో గొలుసు దొంగ

ఈనాడు, హైదరాబాద్‌: కరడు గట్టిన గొలుసు దొంగ ఉమేష్‌ ఖతిక్‌. పోలీసు రికార్డుల ప్రకారం ఇతడి పేరు ఉమేష్‌ అలియాస్‌ లాలో గులాబ్జీ ఖతిక్‌. మైనర్‌గా ఉన్నప్పుడే గొలుసు చోరీల బాటపట్టాడు. అరెస్టయి జైలుకెళ్లినా బయటకు వచ్చి వరుస చోరీలతో హల్‌చల్‌ చేస్తుంటాడు. భార్యపై ప్రేమతోనే దొంగతనాలు చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. చోరీలు చేసే సమయంలో సెల్‌ఫోన్లలోని సిమ్‌కార్డు తీసివేస్తాడు. ఈ నెల 19న హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 5 గొలుసు దొంగతనాలు చేసి పారిపోయాడు. సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి వివరాలు తెలుసుకునే లోపుగానే సొంతూరు అహ్మదాబాద్‌ చేరాడు. సీసీ ఫుటేజ్‌, ఆధార్‌ కార్డు ఆధారంగా ఆచూకీ గుర్తించిన హైదరాబాద్‌ పోలీసులు విషయాన్ని అహ్మదాబాద్‌ పోలీసులకు చేరవేశారు. ఒక కేసులో కోర్టుకు తరలిస్తుండగా పారిపోయాడని, అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. మీరు ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా తీసుకెళ్లవచ్చంటూ హైదరాబాద్‌ పోలీసులకు సలహా ఇచ్చారు. ఒమిక్రాన్‌ కేసుల ఉద్ధృతి నేపథ్యంలో అతన్ని తీసుకురావాలా వద్దా అనే విషయాన్ని పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. గతంలో ఉమేష్‌ ఇక్కడ ఏమైనా నేరాలు చేశాడా! అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గొలుసు చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుల జాబితాలో ఇతడు ఉన్నాడా! అనే వివరాలు సేకరిస్తున్నారు. రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఉమేష్‌ ఖతిక్‌పై కేసులున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని