Crime News: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం స్వాధీనం

కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల వద్ద అధికారులు భారీగా బంగారు

Published : 20 Feb 2022 13:47 IST

కర్నూలు: కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల వద్ద అధికారులు భారీగా బంగారు నగలు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి రాయదుర్గానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 544 గ్రాముల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న కర్ణాటకలోని బళ్లారికి చెందిన రాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. 28 లక్షలు ఉంటుందని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని