Andhra News: ప్రయాణికురాలితో ఆర్టీసీ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న తనతో డ్రైవరు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ వివరాల ప్రకారం.. 

Published : 04 Mar 2022 08:48 IST


డ్రైవర్‌ జనార్దన్‌

విజయవాడ బస్టేషన్‌, నెల్లూరు (రవాణా), న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న తనతో డ్రైవరు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ వివరాల ప్రకారం.. బంధువుల శుభకార్యానికి నెల్లూరు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు బుధవారం రాత్రి నెల్లూరు-విశాఖపట్నం ఇంద్ర ఏసీ బస్సులో అనకాపల్లి వరకు టికెట్‌ తీసుకొని ఎక్కినట్లు తెలిపారు. బస్సులో మొత్తం ముగ్గురు ప్రయాణికులే ఉన్నారన్నారు. ఒంగోలు తర్వాత డ్యూటీ మారిన డ్రైవర్‌ తన పక్క సీటులో కూర్చుంటుండగా.. అన్ని సీట్లు ఖాఫఫళీగా ఉండగా ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశానన్నారు. ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం కూర్చున్నట్లు తెలిపాడన్నారు. బస్సులో దీపాలు తీసేసిన అనంతరం తనతో డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. దాంతో వెనుక సీట్లో ఉన్న వృద్ధ ప్రయాణికుడిని సాయం కోరగా.. అతను పక్షవాతంతో బాధపడుతున్నానని, సాయం చేయలేనని చెప్పాడన్నారు. దాంతో చరవాణి ద్వారా అనకాపల్లిలోని భర్తకు సమాచారం ఇచ్చినట్లు ఆమె వివరించారు. తెలిసిన వారి ద్వారా బస్సు విజయవాడ బస్టేషన్‌కు చేరుకున్నాక డ్రైవర్‌పై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

విధుల నుంచి తొలగింపు.. 

అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌ ఎ.జనార్దన్‌ను అధికారులు తక్షణం విధుల నుంచి తప్పించారు. మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో బస్సును పంపారు. ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు ఘటనకు కారణమైన డ్రైవర్‌పై ఆర్టీసీ విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని