Singareni: సింగరేణి పైకప్పు కూలిన ఘటన విషాదాంతం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలోని సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌ (ఏఎల్‌పీ) బొగ్గు గనిలో

Published : 09 Mar 2022 07:38 IST

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలోని సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌ (ఏఎల్‌పీ) బొగ్గు గనిలో సోమవారం మధ్యాహ్నం పైకప్పు కూలడంతో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరు అదేరోజు రాత్రి సురక్షితంగా బయటపడగా.. సేఫ్టీ మేనేజర్‌ జయరాజ్‌, గని అసిస్టెంట్‌ మేనేజర్‌ చైతన్యతేజ, బదిలీ వర్కర్‌ రవీందర్‌, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్‌ చిక్కుకున్నారు. వీరిలో రవీందర్‌ను మంగళవారం సాయంత్రం సిబ్బంది కాపాడారు. గనిలో చిక్కుకున్న మిగిలిన వారి కోసం సహాయకచర్యలు కొనసాగించగా బుధవారం ఉదయం చైతన్యతేజ, జయరాజ్‌, శ్రీకాంత్‌ మృతిచెందినట్లు గుర్తించారు. అనంతరం వారి మృతదేహాలను వెలికితీసి సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని