Andhra News: గుంటూరులో విషాదం.. మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరి మృతి

గుంటూరు నగరంలో విషాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం పునాదుల తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు

Updated : 16 Mar 2022 14:43 IST

ముత్యాలరెడ్డినగర్‌: గుంటూరు నగరంలో విషాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం పునాదుల తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతిచెందారు. అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను బిహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. సెల్లార్‌ పునాదుల కోసం యంత్రాలతో 40 అడుగుల మేర తవ్వకాలు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరోవైపు ఈ ఘటనపై గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ నిశాంత్‌ కుమార్‌ స్పందించారు. జీ ప్లస్‌ 6 భవన నిర్మాణానికి దరఖాస్తు చేశారని.. ప్లానింగ్‌లో లోపాలు ఉండటంతో అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. లోపాలు సరిచేసే వరకు పనులు ఆపాలని యాజమాన్యానికి సూచించామన్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశామని.. గాయపడిన ముగ్గురికి ప్రాణాపాయం లేదని నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

కార్పొరేషన్‌ అనుమతివ్వలేదు: మేయర్‌ మనోహర్‌ నాయుడు 

కార్పొరేషన్‌ అనుమతి లేకుండా సెల్లార్‌ నిర్మాణానికి పనులు చేపట్టారని గుంటూరు మేయర్‌ మనోహర్‌నాయుడు అన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఘటన దురదృష్టకరమని చెప్పారు. దీనికి బాధ్యులైన యాజమాన్యం, అధికారులను ఉపేక్షించేది లేదని.. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని