Updated : 21 Mar 2022 08:43 IST

Crime News: వనస్థలిపురంలో దారుణం.. కన్నాడు.. కన్నేశాడు!

వనస్థలిపురం, న్యూస్‌టుడే: మానవత్వం మంట కలిసింది. ఓ కర్కశ తండ్రి కన్న కూతుళ్లపైనే లైంగికదాడికి యత్నించాడు. వనస్థలిపురం ఠాణా పరిధిలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం... నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తికి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13, 11 ఏళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. వనస్థలిపురంలోని ఓ కాలనీలో ఉంటున్నారు. అతను ఆటోడ్రైవర్‌. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం మద్యం తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భార్య ప్రతిఘటించేది. అయితే, ఈనెల 17న ఆమెను కొట్టి ఇంటి నుంచి వేరే గ్రామానికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి తొలుత తన 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. అనంతరం ఆ అక్కాచెల్లెళ్లు తప్పించుకుని షీ టీమ్‌కు పోలీసులకు ఫోన్‌ చేశారు. రెండు గంటలైనా స్పందన లేకపోవడంతో తమను పోలీసులు రక్షించలేరని భావించి ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న మహిళ వారిని చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్‌ నంబరు ఇచ్చింది. ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్‌ చేసి వివరాలు తెలపగా సదరు ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఠాణాకు తీసుకెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కుమార్తెలపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోక్సో చట్టం ప్రకారం అతడిపై కేసు నమోదు చేసి శనివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని