Updated : 25 Mar 2022 10:14 IST

Telangana News: బోయిగూడ అగ్నిప్రమాదం.. ప్రేమ్‌ తప్పించుకున్నాడిలా..!

సీసీ కెమెరాలకు చిక్కిన చిత్రాలు

సన్‌షేడ్‌పై ప్రేమ్‌, తప్పించుకుని బయటపడుతున్న దృశ్యం

ఈనాడు, హైదరాబాద్‌- పద్మారావునగర్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ బోయిగూడలోని తుక్కుగోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ప్రేమ్‌కుమార్‌ తప్పించుకున్న దృశ్యాలు గోదాము సమీపంలోని ఓ సీసీకెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన మంటలు తీవ్రమయ్యేసరికి ప్రేమ్‌ కిటికీలోంచి బయటకొచ్చాడు. అనంతరం సన్‌షేడ్‌ మీదకు జారి అటు నుంచి కిందకు దిగాడు. అతడు దిగుతున్న క్రమంలో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి పట్టుకునేందుకు వెళ్లగా ప్రేమ్‌ మరోవైపునకు వెళ్లాడు. ప్రమాదం జరుగుతున్నప్పుడు రక్షించేందుకు వెళ్లిన వ్యక్తి.. ఆ సమాచారాన్ని పోలీసులకు ఎందుకు చెప్పలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ్‌ సమాచారం తెలిసినా కావాలని చెప్పకుండా దాచారా? అన్న కోణంలో 20 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

దూలాలతో పెరిగిన తీవ్రత.. తుక్కుగోదాములో వస్తువులు, పరికరాలను పరిశీలించిన క్లూస్‌బృందం అధికారులు, పోలీసులు కలప దూలాల కారణంగా ప్రమాద తీవ్రత పెరిగిందని భావిస్తున్నారు. దూలాలకు మంటలు అంటుకోవడంతో పైన పడుకున్న కార్మికులు కిందకు దిగే వీల్లేక సజీవ దహనమయ్యారని అంచనా వేస్తున్నారు. తుక్కుగోదాము యజమాని సంపత్‌ కుమారుడు శ్రవణ్‌ను గాంధీనగర్‌ పోలీసులు గురువారం విచారించారు.
 


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts