Cyber Crime: యాప్‌ డౌన్‌ లోడ్‌ చేస్తే.. డబ్బు మాయమైంది

రోజుకో కొత్త తరహా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. అందంగా మాట్లాడి, మభ్యపెట్టి ఓటీపీ నెంబర్లు తెలుసుకుని డబ్బులు కాజేసే ముఠాలు కొన్నయితే... ఆన్‌లైన్‌లో

Updated : 25 Mar 2022 10:25 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : రోజుకో కొత్త తరహా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. అందంగా మాట్లాడి, మభ్యపెట్టి ఓటీపీ నెంబర్లు తెలుసుకుని డబ్బులు కాజేసే ముఠాలు కొన్నయితే... ఆన్‌లైన్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ నెంబర్లు పెట్టి, వాటికి ఫోన్‌ చేసే వారిని నమ్మించి, నకిలీ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయించి డబ్బులు కాజేసే వారూ ఉన్నారు. సరిగ్గా ఇలాగే.. సీతారాంపురానికి చెందిన ఓ వ్యక్తి ఖాతాల నుంచి రూ.75,200లు మాయం అయ్యాయి. సీతారాంపురానికి చెందిన అశోక్‌కుమార్‌ ప్రైవేటు ఎలక్ట్రికల్‌ కంపెనీలో పనిచేస్తుంటారు. ఈ నెల 19న ఉద్యోగంలో భాగంగా తిరుపతిలో సమావేశానికి వెళ్లారు. అక్కడ ఒక యాప్‌ ద్వారా డీటీహెచ్‌కు రీఛార్జి చేశారు. డబ్బులు కట్‌ అయినా.. రీఛార్జి కాకపోవటంతో సదరు యాప్‌ కస్టమర్‌ కేర్‌ నెంబరు కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. ఆన్‌లైన్‌లో కనిపించిన నెంబరుకు ఫోన్‌ చేయగా.. మొబిక్విక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే డబ్బులు తిరిగి వస్తాయని చెప్పటంతో దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆ వెంటనే అతని రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.71,000లు, రూ.4,200లు మాయమైపోయాయి. దీనిపై విజయవాడకు వచ్చి బ్యాంకు అధికారులను కలిసి, వివరాలు తెలుసుకున్నారు. డబ్బులు పోయాయని గుర్తించి సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని