Hyderabad News: టెంపో డ్రైవర్‌ ఘటన..హైదరాబాద్‌ వచ్చిన గోవా పోలీసులు..

బోరబండ టెంపో డ్రైవర్ శ్రీనివాస్‌ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌కు గోవా పోలీసులు వచ్చారు.

Published : 09 Apr 2022 01:41 IST

హైదరాబాద్‌ : బోరబండ టెంపో డ్రైవర్ శ్రీనివాస్‌ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌కు గోవా పోలీసులు వచ్చారు. గత నెల 19న 10మంది ప్రయాణికులను టెంపో డ్రైవర్‌ శ్రీనివాస్‌ గోవాకు తీసుకువెళ్లారు. మరుసటి రోజు అదృశ్యమై మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో నగరానికి తిరిగివచ్చాడు. గోవాలో వెతికితే ఫలితం లేకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడి అంజున పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే.. గోవాలో అదృశ్యమైన శ్రీనివాస్‌ ఇటీవల హైదరాబాద్‌ చేరుకున్నాక అతడ్ని చూసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తల, పొట్ట భాగంలో కుట్లు ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నారేమోనని కుటుంబసభ్యులు అనుమానించారు. రెండ్రోజుల క్రితం అతడిని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ నిమ్స్‌లో చేర్పించారు. చికిత్స అనంతరం శ్రీనివాస్‌ నిమ్స్ నుంచి నిన్న డిశ్ఛార్జ్‌ అయ్యారు. 

అతడికి ఇంట్రాకార్నికల్ ప్రెజర్వేషన్ పద్ధతిలో చికిత్స జరిగినట్లు నిమ్స్‌ వైద్యులు తెలిపారు. అతడి తలకు గాయమై ఉంటుందని.. అందుకే గోవాలో ఈ ఆపరేషన్ చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. బోరబండ ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలో శ్రీనివాస్‌ ఉంటుండటంతో.. గోవాలోని అంజున పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా శ్రీనివాస్‌ నివాసానికి వెళ్లనున్నారు.

అయితే ఈ ఘటనలో అసలు గోవాలో ఏం జరిగిందో తెలియాలని శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు కోరుతున్నారు. అతడి చికిత్స కోసం ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. నిమ్స్‌లో బిల్లు కట్టలేక చికిత్స మధ్యలోనే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని