Crime News : గురజాలలో మహిళపై సామూహిక అత్యాచారం

పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళపై ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Updated : 16 Apr 2022 11:13 IST

గురజాల : పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళపై ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరొక గ్రామానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న మహిళను చూసి కొందరు దుండగులు సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాత్రి సమయం కావడంతో.. ఎవరూ ఈ ఘటనను గుర్తించలేకపోయారు. ఉదయం అటుగా వెళ్లిన కొంతమంది చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె ఎక్కడి నుంచి వస్తోంది.. ఎక్కడికి వెళ్తోంది.. అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆమెతో పాటు 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని