కౌన్సిలర్‌ కారు దహనం చేసిన దుండగులు

ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. ఆ కారు స్థానిక కౌన్సిలర్‌ది కావడంతో కలకలం రేగింది. ఈ సంఘటన పరిగి పురపాలికలో చోటు చేసుకుంది.

Updated : 21 Apr 2022 05:03 IST

పరిగిలో కలకలం

పరిగి గ్రామీణ: ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. ఆ కారు స్థానిక కౌన్సిలర్‌ది కావడంతో కలకలం రేగింది. ఈ సంఘటన పరిగి పురపాలికలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌ రెడ్డి కథనం ప్రకారం... 10 వార్డు పరిధిలోని కిష్టమ్మగుళ్లతండాలో నివాసి కాంగ్రెస్‌పార్టీ కౌన్సిలర్‌ జరుపుల శ్రీనివాస్‌ రాత్రి ఎప్పటిలాగే ఇంటి ఆవరణలో ఉన్న షెడ్డులో కారును పార్కింగ్‌ చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు కారుకు కొందరు నిప్పంటించారు. మంటలు ఒక్కసారిగా ఎగిసి పడటంతో గమనించిన చుట్టుపక్కల వారు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. మంటల్ని ఆర్పే ప్రయత్నంలో భాగంగా అగ్నిమాపక సిబ్బందికీ సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోగా కారు మంటల్లో కాలిపోయింది. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ వెంకట్రామయ్యలు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకే దుండగులు తన కారుకు నిప్పంటించారని పరిగి కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని