
Love: ప్రేమ కోసం పురుషుడిగా మారి.. మోసపోయానని ఫిర్యాదు
ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ప్రేమిస్తున్నానని చెప్పి ఒక మహిళ మరో మహిళను బలవంతంగా పురుషుడిగా మారేలా చేసి.. ఆపై మోసగించిన ఘటన మదురైలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మదురై జిల్లాలోని విల్లాపురం మీనాక్షినగర్ ప్రాంతానికి చెందిన జయసుధకు ఉమచ్చికులం ప్రాంతానికి చెందిన సెంథిలతో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జయసుధపై పురుషుడిగా మారాలని సెంథిల ఒత్తిడి చేసింది. 2021 మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని, తన పేరును ఆదిశివ మార్చుకుంది. ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. సెంథిల తల్లిదండ్రులకు విషయం తెలిసింది. తిరుప్పరకుండ్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పింది. తనకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్‌కు బుధవారం ఆదిశివ వినతిపత్రం అందజేశాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
CM KCR: సీఎం ఇలాకాలో కలికితురాయి.. గజ్వేల్‌కు గూడ్స్ బండి
-
Related-stories News
Facebook: ఫేస్బుక్ మెసెంజర్ సహాయంతో కుటుంబం చెంతకు బెంగాల్ బాలుడు
-
Ap-top-news News
Andhra News: ఏపీలో జులై 5 నుంచి బడులు
-
Related-stories News
Telangana News: సరెండర్‌లీవ్ డబ్బు కోసం ఎదురుచూపులు
-
Ts-top-news News
Telangana News: నన్ను చదివించండి సారూ!
-
Ts-top-news News
TS TET Results 2022: టెట్ ఫలితాలు నేడు లేనట్లే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కూనపై అలవోకగా..
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- లీజుకు క్వార్టర్లు!
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- చందునా.. మజాకా!