లాభాలిస్తామని.. రూ.80 లక్షల క్రిప్టో కరెన్సీ స్వాహా

తాను కొనుగోలు చేసి దాచుకున్న రూ.80 లక్షలు విలువ చేసే క్రిప్టో కరెన్సీని సైబర్‌ దొంగలు కొట్టేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

Updated : 26 Apr 2022 05:09 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తాను కొనుగోలు చేసి దాచుకున్న రూ.80 లక్షలు విలువ చేసే క్రిప్టో కరెన్సీని సైబర్‌ దొంగలు కొట్టేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. శ్రీనగర్‌ కాలనీకి చెందిన వ్యాపారి అదోని మహేష్‌ ట్రేడింగ్‌ చేస్తుంటారు. ఇటీవల రూ.80 లక్షల విలువ చేసే క్రిప్టోను కొనుగోలు చేసి తన వ్యాలెట్‌లో భద్రపర్చుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మీ క్రిప్టోకు అధిక లాభాలు ఇస్తామని నమ్మించి, ‘ట్రాన్‌డాట్‌ఏసీ’ వెబ్‌సైట్‌ వ్యాలెట్‌లోకి పంపించమన్నాడు. బాధితుడు తన క్రిప్టోను బదిలీ చేసేశాడు. తర్వాత ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని