Crime News: ఇష్టం లేని పెళ్లి.. నెల రోజులకే బలవన్మరణం
ఇష్టం లేని పెళ్లి చేశారనే మనస్తాపంతో నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.
జితేంద్రిత
మూసాపేట: ఇష్టం లేని పెళ్లి చేశారనే మనస్తాపంతో నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన తులసి జ్యోత్స్న భర్త గతంలోనే చనిపోయారు. కుట్టు పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన జితేంద్రిత (26)కు పెళ్లి అంటే మొదటి నుంచి ఇష్టం లేదు. దీంతో గతంలోనే చిన్న కుమార్తెకు పెళ్లి చేశారు. ఈ క్రమంలో మార్చి 27న వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సంతోశ్‌తో జితేంద్రిత వివాహం జరిపించారు. నూతన దంపతులు పది రోజుల క్రితం కేపీహెచ్‌బీకాలనీ పరిధి ధర్మారెడ్డి కాలనీలోని హెచ్ఐజీ 14 అద్దెంట్లో కాపురం పెట్టారు. భర్త సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లారు. జితేంద్రిత ఇంటి నుంచే (వర్క్ ఫ్రం హోం) విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని రాత్రి 10 గంటలకు భర్త ఇంటికి వచ్చాడు. ఎంతకు తలుపు తీయకపోవడంతో ఇరుగు పొరుగు సాయంతో తలుపులు పగలకొట్టారు. అయితే అప్పటికే జితేంద్రిత ఉరేసుకుని చనిపోయారు. ఇష్టం లేని వివాహమే ఆత్మహత్యకు కారణమని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్‌ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్