Hyderabad News: నా పూర్వజన్మ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నా..

‘మీరు నా తల్లిదండ్రులు కారు. నా పూర్వజన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నా’ అని ఓ బాలుడు చరవాణిలో వీడియో రికార్డు చేసి, ఇంట్లోంచి వెళ్లిపోయినఘటన ఇది. నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహాస్వామి

Published : 27 Apr 2022 08:18 IST

చరవాణిలో రికార్డు చేసి.. బాలుడి అదృశ్యం

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: ‘మీరు నా తల్లిదండ్రులు కారు. నా పూర్వజన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నా’ అని ఓ బాలుడు చరవాణిలో వీడియో రికార్డు చేసి, ఇంట్లోంచి వెళ్లిపోయినఘటన ఇది. నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహాస్వామి కథనం ప్రకారం.. న్యూవిద్యానగర్‌లోఉండే దంపతులకు 15, 13 ఏళ్ల ఇద్దరు కుమారులు. పిల్లలను భార్య వద్ద వదిలి భర్త వేరుగాఉంటున్నాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా, ఇంట్లోనే టీవీల్లో, చరవాణిల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈక్రమంలో చిన్న కుమారుడు(13) ఈ నెల 1న చరవాణిలో స్వీయ వీడియో ఒకటి రికార్డు చేశాడు. తాను పూర్వజన్మలోని తల్లిదండ్రులవద్దకు వెళ్తున్నానని పేర్కొన్నాడు. కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేక పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని