Updated : 29 Apr 2022 13:50 IST

Hyderabad News: గచ్చిబౌలిలో దారుణం.. విద్యార్థి గొంతు కోసిన తోటి విద్యార్థి

గచ్చిబౌలి: నగరంలోని గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. బాలుర గురుకుల ఐఐటీ క్యాంపస్‌లో విద్యార్థి గొంతును తోటి విద్యార్థి కోశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దాడిలో విద్యార్థికి తీవ్ర రక్తస్రామైంది. దీంతో అతడిని గచ్చిబౌలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈనెల 26న అల్పాహారం విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులకు సర్దిచెప్పి టీచర్ అక్కడి నుంచి పంపించింది. కక్షతో అర్ధరాత్రి సమయంలో విద్యార్థిపై మరో విద్యార్థి దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని