Updated : 03 May 2022 06:44 IST

Hyderabad News: అద్దె ఇల్లు చూస్తామని.. అవసరం తీర్చుకున్న జంట

అమీర్‌పేట, న్యూస్‌టుడే: అద్దె ఇల్లు కావాలని ఇంట్లోకి ప్రవేశించిన ఓ జంట అసహ్యమైన పనులు చేస్తూ యజమానికి అడ్డంగా దొరికిపోయారు. గది వదిలి బయటకు పరుగు తీసి బైక్‌పై తుర్రుమన్నారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. బీకేగూడలో ఓ ఇంటికి టులెట్‌ బోర్డు ఉండటంతో ఓ జంట బైక్‌పై అక్కడికి వచ్చారు. తాము భార్యభర్తలమని, అద్దె ఇల్లు కావాలని అడిగారు. ఇల్లు చూస్తామని రెండో అంతస్తులోని గదిలోకి వెళ్లిన జంట ఎంతకూ కిందకు రాకపోవడంతో యజమాని పైకి వెళ్లాడు. అద్దెకు ఇచ్చే గది తలుపులు తీసి చూసి కంగు తిన్నాడు. లోపల జంట సరస సల్లాపాల్లో మునిగి ఉండటం చూసి గట్టిగా మందలించాడు. వెంటనే ఆ ఇద్దరు కిందకు పరుగుతీశారు. యువతి రోడ్డుపై పరుగెత్తగా, ఆమె వెనకే యువకుడు బైక్‌ తీసుకుని ఉడాయించాడు. సీసీ కెమెరా ఫుటేజీల్లో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. యజమాని సీసీ ఫుటేజీలతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని