Crime News: కొంపముంచిన కుమార్తె ‘ఇన్‌స్టాగ్రాం’ స్నేహం..

సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే అపరిచితులను గుడ్డిగా నమ్మితే ఎదురయ్యే పరిణామానికి ఈ ఘటన ఓ మచ్చు తునక. కూకట్‌పల్లిలోని కార్యాలయంలో బుధవారం ఏసీపీ ఎ.చంద్రశేఖర్‌ కేసు వివరాలను వెల్లడించారు.

Updated : 05 May 2022 06:57 IST

 అతిథిగా వచ్చాడు.. అందినకాడికి దోచేశాడు!

 

సురేష్‌

మూసాపేట, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే అపరిచితులను గుడ్డిగా నమ్మితే ఎదురయ్యే పరిణామానికి ఈ ఘటన ఓ మచ్చు తునక. కూకట్‌పల్లిలోని కార్యాలయంలో బుధవారం ఏసీపీ ఎ.చంద్రశేఖర్‌ కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనల్‌ తండాలోని చింతలగుట్టకు చెందిన బానోతు సురేష్‌ అలియాస్‌ సన్నీ(22) జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్‌లో ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇన్‌స్టాగ్రాంకు అందమైన చిత్రాన్ని ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టడంతో మూసాపేట పరిధి శ్రీహరినగర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థిని అతని స్నేహాన్ని ఆహ్వానించింది. పలుమార్లు ఛాటింగ్‌లు చేసుకున్నారు. గతనెల 20న తల్లిదండ్రులు ఊరెళ్లడంతో ఫోన్‌ చేసి ఇంటికి ఆహ్వానించింది. అతన్ని ఇంట్లోనే కూర్చోబెట్టి శీతలపానీయం కోసం బయటకెళ్లింది. ఇదే అదనుగా అతను బీరువాలోని కొన్ని నగలను జేబులో దాచుకున్నాడు. తర్వాత ఆమెతో కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయాడు. 24వ తేదీనా వచ్చి 20 తులాల నగలు, రూ.10 వేలతో ఉడాయించాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబసభ్యులు ఈనెల 1న కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంట్లోని వారిని విచారించగా సురేష్‌ వచ్చి వెళ్లినట్లు విద్యార్థిని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకొని నగలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని