
Crime News: సినీ నటిని వేధించిన నిందితుడి అరెస్ట్
2 నెలల్లో 319 మంది ఆకతాయిలకు సైబరాబాద్ పోలీసుల కౌన్సెలింగ్
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, రాయదుర్గం: తెలుగు సినీ పరిశ్రమలో పేరున్న నటి. స్టార్‌మేకర్స్ యాప్ ద్వారా ఆమె ఫోన్ నంబరు సేకరించాడో ప్రబుద్ధుడు. ఆమెకు అసభ్య పదజాలంతో వాయిస్ మేసేజ్‌లు పంపాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్ చేసి ఆమె ఫొటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ బెదిరించాడు. తాను చెప్పినట్టు నడుచుకోవాలంటూ మరోవేదనకు గురిచేశాడు. వాట్సాప్ ద్వారా బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయటంతో మాదాపూర్ షీటీమ్స్ ఆ యువకుడిని గుర్తించి రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
డెకాయ్ ఆపరేషన్స్..: సైబరాబాద్ షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్స్ ద్వారా మహిళలను వేధిస్తున్న ఆకతాయిలకు ముకుతాడు వేశారు. అధికశాతం బాధితులు లైంగిక వేధింపులకు గురైన వారే ఉన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో వాట్సాప్, హాక్ ఐ, ఈమెయిల్ తదితర మాధ్యమాల ద్వారా బాధితుల నుంచి 355 ఫిర్యాదులు అందినట్టు సైబరాబాద్ డీసీపీ (షీ టీమ్స్) అనసూయ శనివారం తెలిపారు. అధికంగా వాట్సాప్ ద్వారా 269 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీరిలో ఫోన్ వేధింపులు 141 ఉన్నట్టు చెప్పారు. 81 కేసుల్లో 18 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 119 మందిని పద్ధతి మార్చుకోమంటూ హెచ్చరించారు. 319 మంది ఆకతాయిలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందులో మైనర్లు 98, 19-24 వయస్కులు 112, 25-35 ఏళ్ల వారు 92, 36-50 మధ్య 17 మంది ఉన్నారు. 7 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2 నెలల వ్యవధిలో 1003 డెకాయి ఆపరేషన్, 834 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వేధింపులపై డయల్ 100, వాట్సాప్ నంబర్ 94906 17444 కు ఫిర్యాదు చేయాలని డీసీపీ సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
-
General News
Kiren Rijiju: ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో చూశారా?
-
Movies News
Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
General News
Goats milk: మేక పాలతో మేలెంతో తెలుసా..?
-
Crime News
Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- Constitution: ‘దోపిడికి ఉపయోగపడేలా ఉంది’.. రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
- Life Style: మత్తుబిళ్లల అలవాటు ఉంటే కలయికలో సరిగ్గా పాల్గొనలేరా?
- Sharmila: మీరు పోలీసులా..? తెరాస ఏజెంట్లా..?:షర్మిల
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Location Tracking:యాప్స్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయని అనుమానమా..? ఇలా చేయండి!
- సిగ్గుతో తల దించుకుంటున్నా