ఈతకు వెళ్లి.. బురదలో కూరుకుపోయి..

మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు తెలిపి ఈతకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా కనిపించడంతో ఆమె గుండెలవిసేలా రోదించారు...

Updated : 09 May 2022 05:57 IST

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు పిల్లల మృత్యువాత


లక్ష్మన్న మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

కోసిగి న్యూస్‌టుడే: మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు తెలిపి ఈతకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా కనిపించడంతో ఆమె గుండెలవిసేలా రోదించారు. కోసిగి మండలం అగసనూరు గ్రామానికి చెందిన ఈడిగ ఆంజనేయులు, గీత దంపతులకు కుమార్తెతోపాటు కుమారుడు మరిస్వామి (13) ఉన్నారు. మరిస్వామి ఆదివారం తన స్నేహితులతో కలిసి తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లారు. బురదలో కాలు కూరుకుపోయి మునిగిపోయాడు. స్థానికులు గమనించి బయటకు తీసేసరికి మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. ఈడిగ మరిస్వామి సాతనూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం తల్లి గీతకు మాతృ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం ఈతకు వెళ్లిన కుమారుడు చనిపోవడంతో వారు విషాదంలో మునిగిపోయారు.

సోగనూరు గ్రామంలో..

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మండలంలోని సోగనూరుకు చెందిన గుంటెప్ప, జయమ్మ దంపతుల కుమారుడు లక్ష్మన్న (12) గ్రామ సమీపంలో బావికి వెళ్లి మృతి చెందాడు. వేసవి సెలవులు కావడంతో తోటి పిల్లలతో కలిసి ఈత కోసం బావికి వెళ్లాడు. ఈత వచ్చిన లక్ష్మన్న బావిలో దూకినపుడు పూడికలో కూరుకుపోయి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గుంటెప్ప, జయమ్మకు ఇద్దరు కుమారులు సంతానం. చిన్న కుమారుడి మృతితో కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో వారి వీధిలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని