Published : 14 May 2022 08:26 IST

Hyderabad News: హత్యల్లో.. కేజీఎఫ్‌ ఆయుధం!

ఈనాడు, హైదరాబాద్‌: తాజాగా.. హత్యలు, గొడవలు, దాడులకు నిందితులు ‘సుత్తి’ ఆయుధంగా ఉపయోగించటం చర్చనీయాంశంగా మారింది. మీర్‌పేట్‌ ప్రశాంత్‌హిల్స్‌లో శ్వేతారెడ్డి అనే మహిళ ప్రియుడు యశ్మకుమార్‌ను ఫేస్‌బుక్‌ స్నేహితుడు అశోక్‌తో హత్య చేయించటం సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితులు సుత్తితో యశ్మకుమార్‌ తల వెనుక భాగంలో పలుమార్లు గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ మరణించాడు. నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ కొత్తగూడ వద్ద భార్య జ్యోతి, అతడి ప్రియుడు యశ్వంత్‌ను భర్త శ్రీనివాసరావు సుత్తి ఉపయోగించే హతమార్చాడు. వెండితెరపై కేజీఎఫ్‌ రెండు భాగాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాలో కథానాయకుడు ప్రత్యర్థులను ఖతం చేసేందుకు సుత్తినే వాడతాడు. కొద్దికాలంగా హత్యలు, దాడులకు నిందితులు దీన్నే ఉపయోగించేందుకు సినిమా ప్రభావం కూడా కారణం కావచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts