Crime News: చావలిలో మహిళా వాలంటీర్‌ దారుణహత్య

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మహిళా వాలంటీర్‌ను అతి కిరాతకంగా పొడిచి చంపిన సంఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద (27)ను అదే గ్రామానికి చెందిన

Updated : 16 May 2022 08:32 IST

శారద (పాతచిత్రం)

వేమూరు, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మహిళా వాలంటీర్‌ను అతి కిరాతకంగా పొడిచి చంపిన సంఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద (27)ను అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి 2008లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శారద స్థానికంగా వాలంటీర్‌గా పనిచేసేది. అదే గ్రామానికి చెందిన ఎం.పద్మారావుతో ఆమెకు నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది. ఆరు నెలల క్రితం ఆమె ప్రవర్తనను అనుమానించిన పద్మారావు సచివాలయం వద్ద ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ విషయంపై అప్పట్లో సచివాలయం మహిళా పోలీస్‌ వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతన్ని మందలించి వదిలేశారు. ఈ నేపథ్యంలో శారదపై ద్వేషం పెంచుకున్న పద్మారావు ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు శుభ్రం చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. తప్పించుకోబోయిన ఆమెను కొద్దిదూరం వెంటబడి మెడపై కోసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హత్య విషయం తెలుసుకున్న వేమూరు పోలీసులు, చుండూరు సీఐ కల్యాణ్‌రాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. శారద, పద్మారావు మధ్య వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో ఆమె దూరంగా ఉంచడం, ఆమె ప్రవర్తనపై అనుమానంతోనే పద్మారావు హత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని