Updated : 18 May 2022 10:40 IST

Hyd News: మెట్రో లిఫ్ట్‌ ఎక్కి.. దుస్తులు విప్పి

అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి అరెస్టు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: మెట్రో స్టేషన్‌ లిఫ్టులో మహిళల ముందు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన ఓ యువతి(23) మంగళవారం అమీర్‌పేటలో షాపింగ్‌ ముగించుకుని తిరిగి ఖైరతాబాద్‌ వెళ్లేందుకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌ ఎక్కింది. అమె వెనకే లిఫ్ట్‌లోకి ప్రవేశించిన రాజు(19) అనే యువకుడు తన దుస్తులు విప్పి, అసభ్య చేష్టలతో హడలెత్తించాడు. దీంతో లిఫ్ట్‌ నుంచి పరుగున బయటకొచ్చిన బాధితురాలు మెట్రో సిబ్బంది దృష్టికి తీసుకురాగా వారు రాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజు రోజు మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌ వద్దే ఉంటూ ఒంటరిగా వెళ్లే మహిళల ముందు ఇదే తీరుగా అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని