Updated : 25 May 2022 06:00 IST

ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు.. చోరీల్లో ఘనుడు

నిందితుడి అరెస్టు చూపుతున్న డీసీపీ  వెంకటలక్ష్మి, ఏసీపీ సంపత్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ చదివి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని నర్సంపేట పోలీసులు అరెస్టు చేసి రూ.1.50లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కమిషనరేట్‌లో ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి నిందితుడి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సుందరయ్యపేటకు చెందిన మేకల బాలరాజు (30) దూరవిద్య ద్వారా బీటెక్‌ పూర్తి చేశాడు. ఎలక్ట్రీషీయన్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలు చేయడం ప్రారంభించాడు. విజయనగరంలో పలుమార్లు చోరీలు చేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా ఫిబ్రవరిలో వరంగల్‌ జిల్లా నర్సంపేటకు వచ్చాడు. ఫిబ్రవరి 3వ తేదీన నర్సంపేట పట్టణంలోని కరిమిండ్ల సంపత్‌రావు బ్యాంక్‌ నుంచి రూ.1.50లక్షలు డ్రా చేసుకుని బైక్‌పై డబ్బులు పెట్టుకుని వెళ్తుండగా బ్యాగ్‌ లాక్కుని పారిపోయాడు. డబ్బులను రహస్య ప్రాంతంలో దాచి వెళ్లిపోయాడు. సంపత్‌రావు నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడి కదలికలపై నిఘా ఉంచారు. భద్రపర్చిన నగదును తీసుకెళ్లేందుకు మంగళవారం మాదన్నపేట రోడ్డులో అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారమందగా సీఐ పులి రమేశ్‌, ఎస్సై రాంచరణ్‌ వెళ్లి అదుపులోకి తీసుకొని విచారించి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, సీఐ, ఎస్సైతో పాటు ఏఎస్సై రాజయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ అక్బర్‌పాషా, కానిస్టేబుళ్లు సునీల్‌, రవిలను సీపీ తరుణ్‌జోషి అభినందించారు.
 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని