Suicide: స్నేహితురాలి మరణాన్ని తట్టుకోలేక మోడల్‌ ఆత్మహత్య.. తల్లి షాకింగ్‌ కామెంట్స్‌

బెంగాలీ మోడల్‌, సీరియల్‌ నటి బిడిషా మరణవార్తను మరవక ముందే మరో మోడల్‌,  నటి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఒక వ్యక్తితో...

Published : 28 May 2022 02:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగాలీ మోడల్‌, సీరియల్‌ నటి బిడిషా మరణవార్తను మరవక ముందే మరో మోడల్‌,  నటి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఒక వ్యక్తితో కొంతకాలం నుంచి సహజీవనంలో ఉన్న బిడిషా.. రిలేషన్‌షిప్‌ బ్రేకప్‌ కావడంతో మానసిక ఒత్తిడికిలోనై రెండు రోజుల క్రితమే తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బిడిషా మరణ వార్తను జీర్ణించుకోలేక తాజాగా ఆమె ప్రాణ మిత్రురాలు మంజుషా మృతి చెందారు. ఇకపై బిడిషా తనతో ఉండదనే నిజాన్ని తట్టులేకపోయిన మంజుషా ఇంట్లోనే ఉరి వేసుకున్నట్లు కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

మంజుషా మృతిపై స్పందించిన ఆమె తల్లి మీడియాతో మాట్లాడుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘‘బిడిషా అంటే మంజుకి ఎంతో ఇష్టం, ఎప్పుడూ ఆమె గురించే చెబుతుండేది. బిడిషాతో కలిసి జీవించాలనుకుంటున్నట్లు చాలాసార్లు మంజు మాతో చెప్పింది. ఆ విషయంపై మేము తనకి ఎంతో నచ్చజెప్పాం. కానీ, తను బిడిషాపై ఇష్టాన్ని వదులుకోలేకపోయింది’’ అని మంజుషా తల్లి వ్యాఖ్యలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని