అనిశాకు చిక్కిన విద్యుత్తు ఉద్యోగులు

అవినీతి నిరోధక శాఖ పన్నిన వలలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ కాకినాడకు చెందిన ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు శుక్రవారం పట్టుబడ్డారు. అనిశా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ నగరం డెయిరీఫారం కూడలిలోని డీ7 విద్యుత్తు సబ్‌ స్టేషన్‌లో ఏఈగా మడికి చంటిబాబు,

Updated : 25 Jun 2022 05:14 IST

సర్పవరం జంక్షన్‌: అవినీతి నిరోధక శాఖ పన్నిన వలలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ కాకినాడకు చెందిన ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు శుక్రవారం పట్టుబడ్డారు. అనిశా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ నగరం డెయిరీఫారం కూడలిలోని డీ7 విద్యుత్తు సబ్‌ స్టేషన్‌లో ఏఈగా మడికి చంటిబాబు, లైన్‌మన్‌ మోకా సిద్ధార్థకుమార్‌ విద్యుత్తు లైన్‌ మార్చేందుకు రూ.25 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అదే ప్రాంతానికి చెందిన బాధితులురాలు బచ్చు లక్ష్మి ఏసీబీని (14400కు ఫోన్‌ చేసి) ఆశ్రయించగా పథకం ప్రకారం మాటువేసి లైన్‌మేన్‌ని పట్టుకున్నారు.సబ్‌స్టేషన్‌లో విచారించిన అనంతరం రమణయ్యపేటలో నివాసం ఉంటున్న ఏఈని అదుపులోని తీసుకుని విచారించారు. వసూలు చేసిన మొత్తంలో 10 శాతం డీడీ తీసి మిగతా డబ్బులు లంచంగా డిమాండ్‌ చేశారు. రెండేళ్ల క్రితం ఇదే పనికి రూ.50 వేలు డీడీ తీయించి, రూ.20 వేలు లంచం తీసుకున్నారని, ఇప్పుడు ఆ పని పూర్తి కాకుండానే రూ.25 వేలు డిమాండ్‌ చేశారని బాధితురాలి కూతురు తెలిపారు. ఏఈ చంటిబాబు శ్వాసకు సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు అధికారులకు వివరించగా.. వైద్యుడ్ని రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనిశా అధికారులు సతీష్‌, తిలక్‌, పుల్లారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు