భారీగా గంజాయి పట్టివేత

కారులో తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన 100 కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు ఆదివారం సాయంత్రం పట్టుకున్నారు. ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం... గొడ్లగూడెం కూడలి వద్ద సుకుమామిడి వైపు నుంచి వస్తున్న

Updated : 27 Jun 2022 05:13 IST

మోతుగూడెంలో పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు

మోతుగూడెం, న్యూస్‌టుడే: కారులో తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన 100 కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు ఆదివారం సాయంత్రం పట్టుకున్నారు. ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం... గొడ్లగూడెం కూడలి వద్ద సుకుమామిడి వైపు నుంచి వస్తున్న ఓ కారు, ఎస్కార్ట్‌గా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఈ గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఎండీ అమిరుద్దీన్‌, శాన్వజ్‌, అల్తాఫ్‌, ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన పీతంబర్‌ కిలో, పూర్ణ ఫంగి, పడలమాఖర్‌ను అరెస్టు చేశామన్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ గంజాయిని చింతూరు మండలంలోని సుకుమామిడి గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు విచారణలో గుర్తించామన్నారు. నిందితుల వద్ద నుంచి కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తనిఖీల్లో ఏఎస్సై సత్తిబాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జీవన్‌పాల్‌, కానిస్టేబుళ్లు భరత్‌కుమార్‌, సూరిబాబు, మహేష్‌, బషీర్‌, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఊరుము సమీపంలో..

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: రెండు వాహనాల్లో తరలిస్తున్న 100 కిలోల గంజాయితో నలుగురిని అరెస్టు చేశామని పాడేరు ఎస్‌ఈబీ సీఐ ఎ.సంతోష్‌ తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. జి.మాడుగుల మండలం ఊరుము గ్రామ సమీపంలోని ప్రధాన కూడలి వద్ద ఆదివారం సిబ్బందితో కలిసి తనిఖీలు చేపడుతుండగా.. అనుమానాస్పదంగా వస్తున్న రెండు వాహనాలను ఆపి పరిశీలించామన్నారు. ఈ వాహనాల్లో వంద కిలోల గంజాయి గుర్తించామని చెప్పారు. గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద ఐదు సెల్‌ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారని వివరించారు. ఈ దాడుల్లో ఎస్సైలు సురేష్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని