Updated : 27 Jun 2022 05:25 IST

తప్పుటడుగులు

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం -న్యూస్‌టుడే, దానవాయిపేట

డికి వెళ్లి.. పుస్తకాలు చదవాల్సిన ఆ చేతులు కత్తులు చేతపడుతున్నాయి.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన వయసు.. నేరాలబాట పడుతోంది.. బాల్యంలో వేసిన తప్పటడుగులు వారిని పెద్ద నేరాల వైపు పురిగొల్పుతున్నాయి.. దురలవాట్లకు బానిసలై చిన్న వయసులోనే నేరప్రవృత్తిని అలవర్చుకుంటున్నారు. అతిగా చరవాణి వినియోగం.. సామాజిక మాధ్యమాల ప్రభావం.. బెట్టింగులు.. ఆన్‌లైన్‌ గేమ్‌లు.. సినిమాల్లోని చెడును అనుసరించడం.. తదితర కారణాలు అందుకు దారితీస్తున్నాయని సామాజిక నిపుణులు చెబుతున్నారు. అంతిమంగా 18 ఏళ్లు నిండకుండానే అనేక నేరాల్లో నిందితులుగా ఉంటున్నారు. ఈ పరిణామం సమాజానికి మంచిది కాదని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సీతానగరం

సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన నవీన్‌, మరో బాలుడు నిత్యం మద్యం తాగేవారు. వారిని నాగమ్మ అనే వృద్ధురాలు మందలించడంతో ఆవేశంతో ఆ బాలుడు ఇనుప ఊచతో, నవీన్‌ ఇత్తడి చెంబుతో ఆమె తలపై మోదడంతో వృద్ధురాలు మృతి చెందింది.

అల్లవరం

అల్లవరం మండలం బెండమూర్లంక పెట్రోల్‌ బంకు వద్ద యువకులు సిబ్బందితో ఘర్షణ పడ్డారు. బంకు యజమాని జోక్యం చేసుకుని యువకులను, బంకు సిబ్బందిని మందలించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బాలుడు ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి బంకు యజమానిపై దాడి చేశాడు.

పిఠాపురం

పిఠాపురానికి చెందిన వ్యాను డ్రైవరు నాగేంద్ర(32) గతేడాది నవంబరులో దివాన్‌ చెరువు జాతీయ రహదారి వద్ద కత్తిపోట్లకు గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల విచారణలో ఈ హత్యలో ముగ్గురి హస్తం ఉండగా ఓ బాలుడు కీలకపాత్ర పోషించినట్లు తేలింది. 

 ఎన్నో కారణాలు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాల నేరస్థులు 2019లో 50 మంది ఉంటే 2021లో ఆ సంఖ్య 108కి చేరింది. పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి చాలా కారణాలున్నాయని మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గిపోతోంది. ఆన్‌లైన్‌ తరగతుల ప్రభావంతో స్మార్ట్‌ఫోన్‌ పిల్లల చేతికొచ్చింది. దీంతో చాలా మంది చరవాణిలోని హింసాత్మక గేమ్‌లకు అలవాటుపడ్డారు. దీనివల్ల వారిలో నేర ప్రవృత్తి అలవడుతోందని చెబుతున్నారు.  చిన్న వయసులోనే మద్యం, గంజాయి, సిగరెట్‌ వంటి దురలవాట్లకు బానిసలవుతున్నారు. ఈ మత్తులోనే ఉద్రేకంతో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో జరిగే బ్లేడ్‌ బ్యాచ్‌ల్లో చాలామంది మైనర్లు ఉన్నారు.


విలువలు నేర్పాలి..

ప్రస్తుతం మైనర్లు నేరాలు చేయడానికి ప్రధాన కారణం వారికి విచక్షణ లేకపోవటం.  గతంలో మంచి, చెడు గురించి పెద్దలు కథల రూపంలో చెప్పేవారు.  చిన్నారులకు సైతం ఇప్పడు ప్రత్యేక గదులు ఇస్తున్నారు. చరవాణి ఇచ్చేస్తున్నారు. ఈ సదుపాయాలను వినియోగించుకుని వారు ఏం చేస్తున్నారో పట్టించుకోవటం లేదు.

పద్మశ్రీ, మానసిక వైద్య నిపుణులు, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి


పర్యవేక్షణ అవసరం..

మైనర్లు చేస్తున్న నేరాల అదుపునకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది.  డ్రైవింగ్‌ చేసేవారిని, దొంగతనాలు, దాడులు తదితర అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. పిల్లలపై కచ్చితంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. అవసరాలకు నగదు ఇచ్చే సమయంలో డబ్బు విలువ చెప్పాలి.

-ఐశ్వర్య రస్తోగి, ఎస్పీ రాజమహేంద్రవరం

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని