అనుమానితులకు దేహశుద్ధి

డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామానికి సోమవారం రాత్రి వచ్చిన ఓ మహిళతో పాటు ఇద్దరిని దొంగలుగా అనుమానించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వీరి కోసం మంగళవారం ఉదయం కారులో నలుగురు వ్యక్తులు

Updated : 29 Jun 2022 05:52 IST

  సుద్దులంలో ఎస్సై గణేశ్‌తో వాగ్వాదానికి దిగిన స్థానికులు

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామానికి సోమవారం రాత్రి వచ్చిన ఓ మహిళతో పాటు ఇద్దరిని దొంగలుగా అనుమానించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వీరి కోసం మంగళవారం ఉదయం కారులో నలుగురు వ్యక్తులు రావడంతో పంచాయతీలో విచారించి చితకబాదారు. విషయం తెలుసుకుని ఎస్సై గణేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పెట్రోలింగ్‌ నిర్వహించడం లేదని, చోరీ కేసులు ఎందుకు ఛేదించడం లేదంటూ.. పోలీసుల వాహనం అడ్డగించి ఎస్సైతో మహిళలు, యువకులు వాదనకు దిగారు. దీంతో రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమానితులను గ్రామంలోనే విచారించాలని పట్టుబట్టారు. స్థానికులను ఒప్పించి అనుమానితులను ఠాణాకు తరలించారు.

గ్రామానికి చెందిన వ్యక్తి భార్య చాలా ఏళ్ల కిందట మరణించడంతో మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడని, ఈ మేరకు నిజామాబాద్‌లో కూలీ చేసుకునే మహిళతో పాటు మరో ఇద్దరు రాగా.. అదే సమయంలో గస్తీ కాస్తున్న స్థానికులు వారిని అనుమానించి తమకు అప్పగించారని ఎస్సై గణేశ్‌ తెలిపారు. వీరు దొంగలు కాదని విచారణలో తేలడంతో విడిచి పెట్టినట్లు వివరించారు. * సుద్దులంలో వరుస చోరీలకు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి సహకారం ఉందని వార్త ప్రసారం చేసిన యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరిని గ్రామస్థులు పిలిపించి నిలదీశారు. తప్పైందని, క్షమించాలని చెప్పడంతో శాంతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని