ఇద్దరు దొంగల అరెస్టు

తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షలు రికవరీ చేశారు. సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శుక్రవారం....

Updated : 02 Jul 2022 06:34 IST


వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వొెంకటేశ్వర్‌, చిత్రంలో సీఐ కృష్ణ

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షలు రికవరీ చేశారు. సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీఐ కృష్ణ, ఎస్సై సందీప్‌తో కలిసి ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌ వివరాలు వెల్లడించారు. భిక్కనూరుకు చెందిన రమేష్‌, బోధన్‌కు చెందిన కిరణ్‌ పాత నేరస్థులు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చారు. రెండు నెలలుగా నిజామాబాద్‌ నాలుగో ఠాణా, డిచ్‌పల్లి పరిధిలో వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటీవల ఆర్యనగర్‌లో జరిగిన ఓ చోరీ కేసులో రమేష్‌, కిరణ్‌ను నిందితులుగా గుర్తించారు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు