Updated : 03 Jul 2022 06:32 IST

చిత్తూరులో రోడ్డు ప్రమాదం

ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల మృతి

చైతన్యరెడ్డి (పాత చిత్రం)

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరం మురకంబట్టులోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు మస్తాన్‌, చైతన్యరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. గూడూరులోని పున్నపువారిపాళ్యంకు చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు మస్తాన్‌, గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లికి చెందిన నాగిరెడ్డి కుమార్తె చైతన్యరెడ్డి.. చిత్తూరులోని ఎస్వీసెట్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మస్తాన్‌ నగరంలో గది తీసుకుని ఉంటున్నాడు. అదే కళాశాల వసతి గృహంలో చైతన్యరెడ్డి ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఇద్దరూ కళాశాల నుంచి సొంత పనిపై నగరానికి వెళ్లడానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మురకంబట్టు వద్ద ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్నారు. అక్కడ ఉన్న చిన్న మలుపును అతడు గుర్తించలేక వాహనాన్ని అదుపు చేయలేక పక్కనే ఉన్న డివైడర్‌ గోడను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఎగిరి దూరంగా పడ్డారు. ఇద్దరికీ శిరాస్త్రాణం లేకపోవడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు. రోడ్డు ప్రమాదంతో ప్రజలు పెద్దఎత్తున గుమికూడటంతో రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు, పెనుమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ పునరుద్ధరించారు.మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రి శవాగారానికి తరలించి, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని